మూడో సంవత్సరంలోకి మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రజలతో మమేకమై, ప్రజాసేవలో కొనసాగుతున్న మంత్రి లక్ష్మణ్ కుమార్, రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలోఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా క్యాబినెట్ మంత్రిగా పదోన్నతులు పొంది ప్రజాసేవలో ముచ్చటగా మూడో సంవత్సరం బుధవారం అడుగుపెడుతున్నారు.. మంత్రి లక్ష్మణ్ కుమార్ ది, రాజకీయ వారసత్వ కుటుంబం కాదు, ఆర్థిక స్థితిమంతుడు కాదు, అనాదిగా అణిచివేయబడుతున్న అట్టడుగు వర్గాల దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.

ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబర్ 3న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిర్దర్శించుకుంటున్న మంత్రి లక్ష్మణ్ కుమార్(ఫైల్ ఫోటో)

👉 రాజకీయ ప్రస్థానంలో..

విద్యార్థి దశలో ఎన్ ఎస్ యు ( NSU )విద్యార్థి సంఘం నాయకుడిగా, రంగ ప్రవేశం చేసిన లక్ష్మణ్ కుమార్ , బాల్యం, విద్యాభ్యాసం సింగరేణి ప్రాంతం, మంత్రి లక్ష్మణ్ కుమార్ , రాజకీయ ప్రస్థానం (2014 – 2023)  దశాబ్దన్నర కాలం పాటు ,పూల బాట కాలేదు, ఆయన పాలిట ముళ్ళబాట అయ్యింది. ఆ బాటలోనే అడుగులు వేస్తూ, ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తూ నాటి అధికార  బీఆర్ఎస్ పార్టీకి, కొరకరాని కొయ్యగా మారారు. నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ఇత్తనాలు ఫ్యాక్టరీ నిర్మాణం పనులు అడ్డుకోవడం, ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిచిపోవడానికి మంత్రి లక్ష్మణ్ కుమార్, చేసిన ప్రజా పోరాటాలలో ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక పోరాటం అని చెప్పవచ్చు.

డిసెంబర్ 3, 2023 లో ఎమ్మెల్యేగా గెలిచినట్టు ఎన్నికల సంఘం నుంచి. ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్న మంత్రి లక్ష్మణ్ కుమార్(ఫైల్ ఫోటో)

తప్పుడు కేసుల నమోదు, అర్ధరాత్రి అపరరాత్రి ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు,  వరుస ఓటములు, రాజకీయ ప్రత్యర్థుల హేళనలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు,  నాటి ప్రతిపక్ష పార్టీల కీలక నాయకులు తమ  పార్టీ లోకి రమ్మని ప్రలోభాలు, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల ఆశలు కల్పించిన, కాంగ్రెస్ పార్టీని వీడని కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా సొంత పార్టీ తో ప్రతిపక్ష పార్టీలో గుర్తింపు పొందారు.

👉 వరుస పరాజయాలు ప్రతిపక్షాల పరిహాసాలు !

2009 లో నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో (రిజర్వుడు) 14 సంవత్సరాల తర్వాత. కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన లక్ష్మణ్ కుమార్ 2009 నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు. 2009, 2010, 2014, 2018, ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలో  వరుసగా పరాజయం చెందుతూ ప్రతిపక్ష రాజకీయ పార్టీల పరిహాసాల తో మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆయన క్యాడర్ లో కసి పట్టుదల మొదలైంది.

2023 ఎన్నికల్లో చావో, రేవో అంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కుటుంబ సభ్యులు, కలిసికట్టుగా లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం అహో రాత్రులు కృషి చేశారు. నియోజకవర్గ ఓటర్లు ,ప్రజలు  కరుణించి అయ్యో పాపం  లక్ష్మణ్ కుమార్ ను అంటూ 22 వేల ఓట్ల మెజార్టీతో మంత్రి లక్ష్మణ్ కుమార్ రెండు సంవత్సరాల క్రితం గెలిపించారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు అచ్చి వచ్చిన “ధర్మ” అనే అక్షరాలు !

మంత్రి లక్ష్మణ్ కుమార్ రాజకీయ ప్రస్థానంలో
” ధర్మ ” అనే అక్షరాలు ఆయనకు అచ్చి వచ్చాయి.
2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మారం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి సభ్యుడిగా లక్ష్మణ్ కుమార్ పోటీ చేసి  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ,మాజీ మంత్రి మాతంగి నరసయ్య  పై లక్ష్మణ్ కుమార్ 3000 ( మూడు వేల) ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తదనంతరం నెలకొన్న రాజకీయ పరిస్థితులలో కొంతకాలం పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా ఉమ్మడి రాష్ట్ర లోఎస్సీ కార్పొరేషన్ కొనసాగారు.

నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్, టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలో  వరుసగా ఓటమి చెందారు.  2023 లో చిరకాల రాజకీయ ప్రత్యర్థి సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఓడించిన మంత్రి లక్ష్మణ్ కుమార్, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాల వ్యవధిలోనే ప్రభుత్వ విప్ గా, క్యాబినెట్ మంత్రిగా పదోన్నతులు పొందారు. మొట్టమొదటిసారి ధర్మారం జడ్పిటిసి గా  విజయం సాధించి రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఉమ్మడి కరీంనగర్ జడ్పీ చైర్మన్ కొనసాగారు. మంత్రి లక్ష్మణ్ కుమార్, రాజకీయ ప్రస్థానంలో ధర్మారం, ధర్మపురి అనే అక్షరాలు అచ్చి వచ్చాయి అనేది ఆయన మిత్ర బృందంలో చర్చ.