నాగపూర్ లో గణపతి సహస్ర అభిషేకం !

👉 టేకిడి గణేష్ సన్నిధిలో 108 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం 2026, జనవరి 3 న..

J.SURENDER KUMAR,

2026 నూతన సంవత్సర మొదటి శనివారం జనవరి 3 న మహారాష్ట్ర లోని నాగపూర్ టేకిడి గణేష్ సన్నిధిలో 108 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం నిర్వహించనున్నట్టు అభిషేక  సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది తెలిపారు.

విశిష్ట పర్వ దినము శని దేవుని జన్మ నక్షత్రం పుష్యమి. శని భగవానునికి ప్రీతి కరమైన మాసం పుష్యమాసం జనవరి 3 న పుష్యపూర్ణిమ శాఖంభరి నవరాత్రుల్లో చివరి రోజును శాఖంబరి జయంతి అని అంటారు. ఈ రోజు ఆర్డ్రా నక్షత్రం శివ ముక్కోటి అంటారు అని వినోద్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

మహారాష్ట్ర శీతాకాల రాజధాని, ఆరెంజ్ సిటీ గా ప్రసిద్ధ నాగపూర్ నగరం లోని రైల్వే స్టేషన్ ప్రాంతం లో వెలసిన టేకిడి గణపతి విదర్భ అష్ట వినాయకులలో మొదటిది స్వయంబు సింధూర వర్ణ వృక్ష మూల గణపతి దేశం లోనే అత్యంత అరుదైన గణేష్ మూర్తి అని  పేర్కొన్నారు.

👉 గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం జరగనున్న గణేష్ క్షేత్రాలు !


👉 శనివారం 3 వ తేదీ ఉదయం 9.00 నుండి సనాతన ధర్మ పరిరక్షణార్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయం  తో 108 వ గణపతి అథర్వశీర్ష సహస్ర అభిషేకం జరగనున్నది.


👉 శనివారం గోధూళి ముహూర్తం లో విదర్భ అష్ట వినాయకులలో ఒకటైన రాంటేక్ అష్ట దశ (18) భుజ వినాయకుని దివ్య సన్నిధిలో 109  వ గణపతి అథర్వ శిర్ష సహస్ర అభిషేకం జరగనున్నది.


👉 జనవరి 4 న ఆదివారం ఉదయం వామనుడు బలి చక్రవర్తిని పాతాలానికి  పంపిన ప్రదేశం ఆదాసా లోని శమీ గణపతి వద్ద 110 వ గణపతి అథర్వ శిర్ష సహస్ర అభిషేకం నిర్వహించనున్నట్టు అభిషేక సమన్వయకర్త వినోద్ కుమార్ మహా వాది ప్రకటనలు స్పష్టం చేశారు.

👉  గణేష్ అభిషేక వివరాల కోసం ..

వినోద్ కుమార్ మహావాది, సహస్ర  అభిషేక  సమన్వయ కర్త !
మొబైల్ ! 9000013755