J SURENDER KUMAR,
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో మొత్తం ₹532.24 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ , ధనసరి అనసూయ సీతక్క , సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు !
👉 ₹ 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు !
👉 ₹ 130 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణం.!
👉 ₹ 82.56 కోట్ల రూపాయలతో హన్మకొండ – నర్సంపేట – మహబూబాబాద్ రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులు.!
👉 ₹ 17.28 కోట్ల రూపాయలతో నర్సంపేట – పాకాల రోడ్డు విస్తరణ పనులు.!
👉 ₹ 56.40 కోట్ల రూపాయలతో నర్సంపేట నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ !
👉 ₹ 26 కోట్ల రూపాయలతోప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణం.!
👉 ₹ 20 కోట్ల రూపాయలతో నర్సంపేట పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు.!
