నేడు ధర్మపురి నియోజకవర్గ సర్పంచ్ సభ్యులకు సన్మానం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆధ్వర్యంలో!

J SURENDER KUMAR,

పార్టీ రహితంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మపురి నియోజకవర్గ  సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులను,  రాజకీయాలకతీతంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సన్మాన కార్యక్రమం జరగనున్నది.

ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి AC ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం జరుగనున్నది. ఉదయం 10.30 గంటలకు ధర్మపురి పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానం నుండి పటేల్ చౌరస్తా,గాంధీ చౌరస్తా,నంది చౌరస్తా, చింతామణి చెరువు కట్ట, అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ కొనసాగనున్నది.