J.SURENDER KUMAR,
మంథని మహా గణపతి దేవాలయం లో బుధవారం 107 వ గణపతి అథర్వశీర్ష సహస్ర అభిషేకం (వెయ్యి సార్లు) మరియు మన్యు సూక్త అభిషేకం 108 సార్లు జరుగుతుందని. నిర్వాహకులు సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది తెలిపారు.
ఉదయం 8.00 గంటల నుండి12.30 వరకు గణపతి ఆలయంలో కార్యక్రమము, జరుగుతుందని తెలిపారు. అభిషేకం అనంతరం మంథని గాయత్రి వైదిక సంస్థ వరంగల్ వారి సౌజన్యం తో దత్త నవరాత్రుల్లో భాగంగా దత్తాత్రేయ ఆలయంలో అన్నదానం కొనసాగుతుందని తెలిపారు.
గత రెండు సంవత్సరాలు ఇదే రోజు అభిషేకం జరిగినది. అభిషేకం లో పాల్గొనే వారు ఎరుపు రంగు పంచె, ఉత్తరీయం తో రావాలి అని వినోద్ కుమార్ మహావాది. వివరించారు.
