👉 భూపాల్ పల్లి కలెక్టర్ కార్యాలయంలో మూడు జిల్లాల కలెక్టర్లతో..
J.SURENDER KUMAR,
ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల, వయోవృద్ధులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి సంబంధిత శాఖామంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముగ్గురు జిల్లా కలెక్టర్ లతో బుధవారం ఉదయం 11 గంటలకు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
వరంగల్, హన్మకొండ, జయ శంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్సి మరియు గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారులు పాల్గొననున్నారు.
👉 ప్రత్యేకంగా ఈ సమీక్ష సమావేశంలో..

TGSWREIS & TGTWREIS రెసిడెన్షియల్ పాఠశాలల ZO’లు/RCO’లు/ప్రిన్సిపల్స్. ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు. SCDD మరియు TWD హాస్టల్ సంక్షేమ అధికారులు. SC కార్పొరేషన్, ST కార్పొరేషన్ యొక్క EDలు, ITDA యొక్క POలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు .
