నిజాలు నిలకడ మీదే తెలుస్తాయి !

👉 పూర్వ మావోయిస్టులు !

👉 హిడ్మా బూటకపు ఎన్కౌంటర్ పత్రికా ప్రకటనలో !


J.SURENDER KUMAR,


డిసెంబర్ మొదటి వారంలో కామ్రేడ్ హిడ్మా  బూటకపు ఎన్కౌంటర్ లో అసువులు బాసిన విషయం తెలిసిందే.  ఆ ఎన్కౌంటర్ వెనుక పోలీస్ లకు ఉప్పందించిన వారు ఏవరు ? అనే విషయం లో జరిగిన అనేక ఊహాగానాలకు, ఇటీవలి పరిణామాలు వికల్స్ ప్రకటనతో తేటతెల్లం చేశాయని నిజాలు నిలకడ మీదనే తేలుతాయన్న నానుడి పై విశ్వాసంతో ఉన్నామని అది సరియైనదే అని నిర్ధారణ అయినట్టు పూర్వ మావోయిస్టుల పేరిట జారీ చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

మొదటగా కామ్రేడ్ హిడ్యా మరణానికి, పూర్వ మావోయిస్ట్ నాయకులే కారణం అని, నిర్దిష్టంగా వేణుగోపాల్, వాసుదేవరావు ల పేర్లు సైతం తీసుకొని నిందించిన విషయం చూసాం, విన్నాం, చదివాం. అని ప్రకటనలో పేర్కొన్నారు.

పత్రికా ప్రకటన..

ఆలస్యంగానే అయినప్పటికీ కారణాలు వెల్లడి చేస్తూ, సాయుధ మావోయిస్టు పార్టీ నాయకులే వాస్తవాలతో ముందుకు రావడం అభినందనీయం. కామ్రేడ్ వికల్ప్ కామ్రేడ్ హిడ్మా మరణానికి దారి తీసిన పరిస్థితులు వివరించి, ప్రజలకు స్పష్టం చేయడం మంచిది.

ఇప్పటి వరకు కామ్రేడ్ సుధీర్ నుండి కామ్రేడ్ కోసదా, రాజుదా ల ఎన్కౌంటర్ వరకు దారి తీసిన పరిస్తితులను, 15 సెప్టెంబర్ వరకు మనం చేసుకున్న సమీక్షలను, అనవసర టెక్నికల్ విషయాలను తొలగించి (కామ్రేడ్ హిడ్మా సందర్భంగా పేర్కొన్నట్టు) నిజాయితీగా కామ్రేడ్ అభయ్, వికల్ప్ లు ప్రకటించాలని పూర్వమావోయిస్టుల ప్రకటనలో పేర్కొన్నారు.

సాయుధ పార్టీ అధికార ప్రతినిధులు, వెంటనే స్పందించి పార్టీ ప్రతిష్ఠను నిలబెడుతారని, పార్టీలో దృఢంగా నిలిచి సెంట్రల్ కమిటీ అప్పగించిన ప్రతి పనినీ విప్లవ సంకల్పంతో కొనసాగించిన నాయకత్వ నిజాయితీని రాజకీయ విభేదాలకు బలి పెట్టకుండా ఎత్తి పట్టడం మీ బాధ్యతే అవుతుంది అని పేర్కొన్నారు..

విప్లవోద్యమ సమస్యలు, ఎన్కౌంటర్ ల మధ్య
అమరత్వాలు, తృటిలో బయట పడడం లాంటి విషయాలలో ఎంతో అనుభవం, స్పష్టత ఉన్నప్పటికీ, కావాలనే, దురుద్దేశపూరితంగా విప్లవ పార్టీ అంకిత భావం, నిజాయితీపై బురద చల్లుతూ ముందుకు తెస్తున్న నిరాధారమైన ఆరోపణలను మన సమీక్షల ఆధారంగా తిప్పి కొటాలనీ పూర్వ మావోయిస్టులు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.