పది సంవత్సరాలు నీ అరాచకాలు ప్రజలకు వివరిస్తా!

👉 మాజీ మంత్రి ఈశ్వర్ పై మంత్రి లక్ష్మణ్ కుమార్ ధ్వజం !

J.SURENDER KUMAR,

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నీవు  గత పది సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాను అని  సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ మాటలలో….

👉 అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం, మీ నాయకత్వమే !

👉 సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఒక్క సంక్షేమ హాస్టల్ భవనం కూడా నిర్మించలేదని ప్రజలకు తెలుసు !

👉 ప్రజా సమస్యలను విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు !

👉 అభివృద్ధి చేయని మీరు, నాపై విమర్శలు చేయడం సరికాదు !

👉 ప్రజల తీర్పే మీ రాజకీయ వైఫల్యానికి సమాధానం !