👉 తెలంగాణ ప్రజలకు వేషరతుగా క్షమాపణలు చెప్పాలి !
J SURENDER KUMAR,
అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్న ప్రముఖ నటుడు, పవన్ కళ్యాణ్ పద్ధతి ప్రకారం మాట్లాడాలి, తెలంగాణ పట్ల ఆయన మాట్లాడిన మాటలు ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
👉 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో బుధవారం మంత్రి మీడియాతో సమావేశంలో మాట్లాడారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్లు నష్టానికి, తెలంగాణకు ప్రజలకు ఏం సంబంధం ? ఆయన బహిరంగంగా చేసిన తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యానాలు బాధాకరం మంత్రి అన్నారు.
👉 ప్రాంతాలుగా విడిపోయిన ఇరు రాష్ట్రాల ప్రజలు సౌహార్దం, సోదరభావం కొనసాగుతున్న ప్రజల మధ్య మునస్పర్ధలు కలిగించే విధంగా మాట్లాడటం సరైంది కాదు అని తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు పరస్పర గౌరవం పాటించడం అవసరం” అని మంత్రి అన్నారు.
👉 మీ సినిమాలను తెలంగాణ ప్రజలు అపారంగా ఆదరించారు, ఆదరిస్తున్నారు, కళాకారులకు ప్రజానీకం చూపే అభిమానం, ప్రేమకు హద్దులు ఉండవని అలాంటి అభిమానుల, ప్రజల మనసు నోప్పించే వ్యాఖ్యలు చేయడం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తగదు” అంటూ మంత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
👉 సమస్య జటిలంకాకముందే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భేషరతుగా తక్షణం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
