👉 షోకాజ్ నోటీసులకు సమాధానం ఎవరు ఇస్తారు ?
J SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైరాజరైన సిబ్బంది అంశంలో నిర్లక్ష్యం ఎవరిది ? కలెక్టర్ జారీ చేసిన షోకాస్ నోటీసులకు వివరణ ఎవరు ఇస్తారు అనే చర్చ ధర్మపురి అంగన్వాడి టీచర్ లలో మొదలైంది.
మొదటి విడత సందర్బంగా ఎన్నికల విధులు కేటాయించగా జిల్లాలో 89 మంది ఎన్నికల సిబ్బంది హాజరు కానందున జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు గురువారం రాత్రి జారీస్ చేసిన షో కాజు నోటీసులలో 24 గంటలలో వివరణ కోరుతూ ఉత్తర్వులలో ఆదేశించిన విషయం తెలిసిందే.
👉 ఎన్నికల విధుల సమాచారమే లేదు..
89 మంది ఉద్యోగులలో ధర్మపురి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొందరు అంగన్వాడి టీచర్ల పేర్లు ఉన్నాయి.
వీరికి పంచాయతీ ఎన్నికల నిర్వహణ మొదటి విడత, రెండో విడత, మూడో విడత, సమాచారం లేదు. ఆయా మండల కేంద్రాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు వీరికి ఎన్నికల నిర్వహణ ముందస్తు సమాచార లేఖ గాని ,ఎన్నికల విధులు కేటాయించిన మండలం, తదితర వివరాలు ఎన్నికల విధులు నిర్వహించే గ్రామ పంచాయతీల సమాచార ఉత్తర్వులు వీరికి జారీ చేయలేదు.
ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు అందినట్టు వీరి నుంచి బాధ్యులు రసీదులు స్వీకరించలేదు. ఎన్నికల విధులకు సంబంధించి ఈమెయిల్ సమాచారం కానీ, అంగన్వాడీ టీచర్లకు శాఖ పరమైన వీరి మొబైల్ ఫోన్లకు ఎన్నికల విధుల సమాచారం చేరలేదు.
ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు షోకాస్ నోటీసులలో పేర్లు ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
