👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
క్రిస్మస్ పండుగ వేడుకలు సమాజంలో ప్రేమ తత్వాన్ని సోదర భావాన్ని ,ఐక్యత, మరింత బలోపేతం చేస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణ కేంద్రంలోని స్థానిక ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం జరిగిన ధర్మపురి నియోజకవర్గ క్రిస్మస్ పండుగ వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జె.ఎస్. లత, జిల్లా అధికారులతో కలిసి పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...
క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఐక్యతను కాపాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.

క్రైస్తవ మైనారిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల ద్వారా వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి అన్నారు.
భవిష్యత్తులో క్రైస్తవ మైనారిటీలకు మరింత మెరుగైన సహకారం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ వేడుకలలో క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
