J.SURENDER KUMAR,
ప్రతి రంగంలో పోటీ తత్వం విజయం సాధించాలనే లక్ష్యం ప్రతి యువకుడు, క్రీడాకారుడు అలవర్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోనీ డా. బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 72వ సీనియర్ స్త్రీ&పురుషులు కబడ్డీ చాంపియన్ షిప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు..
