ప్రభుత్వం పశుసంపద సంక్షేమానికి నిధులు విడుదల !

👉 గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల మందుల కు
₹ 4-43 కోట్ల నిధులు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ప్రభుత్వం పశుసంవర్ధక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రాష్ట్రంలో దాదాపు 2,10,99,035 జీవాలకు (గొర్రెలు మరియు మేకలకు) ఉచిత నట్టల నివారణ మందుల పంపీణీ కార్యక్రమాన్ని కి  ₹ 4,43,70,974/-( నాగులు కోట్ల,నలభై మూడు లక్షల డెబ్బై వెయిల, తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలను) నిధులు కేటాయించి ఖర్చు చేయనుంది అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం నక్కలపేట్ గ్రామంలో  ప్రభుత్వం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన గొర్రెలు, మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమం శనివారం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుండి 31వరకు ఉచిత నట్టాల నివారణ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి అన్నారు
ఒక్కొక్క గొర్రె , మేకకు సుమారు ₹ 2.10 రూపాయల చొప్పున ప్రభుత్వం గుర్తు చేస్తున్నదని అన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో మొత్తం 1,80,058 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గాను ప్రభుత్వం సుమారు ₹.3,78,122/- ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

👉 నట్టల నివారణ మందులు త్రాగించడం వల్ల గొర్రెలు, మేకల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని, శరీర బరువు పెరిగి మంచి ఉత్పత్తి లభిస్తుందని మంత్రి అన్నారు.

👉 వ్యాధులు తగ్గి గొర్రె మేకల మరణాలు నివారించబడతాయని అలాగే ఫీడ్ సమర్థవంతంగా వాటి శరీరానికి చేరడం వల్ల పశుపోషక రైతులకు ఆర్థిక లాభాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.

👉 గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పశుసంవర్ధక రంగం కీలకమని  రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ఉచితంగా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. భవిష్యత్తులో కూడా పశుపోషకుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

👉 అదే విధంగా గ్రామానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, గొర్రెలు-మేకల పెంపకదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.