ప్రభుత్వం పై విశ్వాసానికి నిదర్శనం ఎన్నికలలో విజయం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

👉 సర్పంచ్ లు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, వాటి ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయం అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులను, మంత్రి లక్ష్మణ్ కుమార్, ఘనంగా సన్మానించి మిఠాయి తినిపించి, వారికి, కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ  బలపరచిన అభ్యర్థులే ఘన విజయం సాధించడం అభినందనీయమని మంత్రి అన్నారు.

ఈ ఫలితాలు ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయని, కొన్ని స్థానాల్లో పార్టీ బలపరచిన అభ్యర్థులు ఓటమి చెందటం జరిగిందని, ఓటమి చెందిన అభ్యర్థులు ఎవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, పార్టీ వారికి అండగా ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.