పుట్ట మధు మతి బ్రమించి మాట్లాడుతున్నావ్ ఖబర్దార్ !

👉 మధు పై  మంథని నియోజక వర్గ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం !

J.SURENDER KUMAR,

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మతిభ్రవించి

మంత్రి శ్రీధర్ బాబు పై, ఆయన కుటుంబం పై

ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావ్ 

ఖబర్దార్ అంటూ మంథని నియోజకవర్గ

కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు

ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అనుచిత వాక్యలు చేసిన పుట్ట మధుకు వ్యతిరేకంగా మంథని, రామగిరి, కమాన్పూర్ ముత్తారం మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం డా.బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

👉 ఈ సందర్బంగా నాయకులు
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మెంబర్ శశిభూషణ్ కాచే, జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం,మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న,ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్లు కొత్త శ్రీనివాస్, ఇనగంటి భాస్కరరావు,మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి,మార్కెట్ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ,మాజీ కౌన్సిలర్ కొలిపాక సుజాత, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, లద్నాపూర్ సర్పంచ్ రామచందర్రావు, సీనియర్ నాయకులు మహేశ్వరావు కోలేటి మారుతి మాట్లాడుతూ…..

👉 పుట్ట మధుకు రాజకీయ భిక్ష పెట్టింది దుద్దిళ్ళ కుటుంబం పుట్ట మధు నీ రాజకీయ చరిత్ర మా అందరికి తెలుసు నువ్వు ఏ స్థాయి నుంచి ఎలా ఎదిగావో ఏందనేది ఈ మంథని ప్రజలందరికీ తెలుసు నిన్ను శ్రీపాద రావు గారు చేరదీసి నీకు రాజకీయ ఓనమాలు నేర్పి నిన్ను ఎంపీటీసీగా, జెడ్పిటిసిగా అనేక పదవులు కట్టబెట్టి నిన్ను రాజకీయ నాయకుడిని చేసి చేసిన ఘనత స్వర్గీయ శ్రీపాద రావుది దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కుటుంబంపై  స్థాయి మరిచి పుట్ట మధు  పిచ్చి పట్టినట్లుగా మాట్లాడం తన అవివేకనికి నిదర్శనం అన్నారు.

నువ్వు బహుజనవాదం, బహుజనవాదం అంటూ విర్రవీగుతున్నావ్ బహుజనులను ఎంతమందిని నువ్వు నాయకులు తయారు చేశావో అంబేద్కర్ సాక్షికి ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు.

👉 మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా, ఎన్నాడైనా మీడియా సమావేశంలో  నీ భార్యను గాని నీ బిడ్డను గాని నీ కొడుకును నీ అల్లుడు కుటుంబ సభ్యులను ప్రస్తావించామా ?  అనేది గుర్తుంచుకోవాలని, రాజకీయాలలోకి కుటుంబలను తీసుకురావద్దని హితవు పలికారు.

👉 శ్రీధర్ బాబు  మంథని నియోజకవర్గం తెస్తున్న నిధులను  చేస్తున్న అభివృద్ధి ఓర్చుకోలేకుండ తనను  మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నియోజకవర్గం తప్పకుండ ఒడగొడతారన్న విషయం అర్థం చేసుకొని శ్రీధర్ బాబు వారి కుటుంబం ఫై అసభ్య పదజాలం వాడుతు వారి ఫై బురద చల్లడం జరుగుతుంది. ఇక ఫై శ్రీధర్ బాబు పై వారి కుటుంబం అనుచిత వాక్యాలు చేస్తే యావత్తు తెలంగాణ సమాజం, కాంగ్రెస్ పార్టీ, మంథని నియోజకవర్గం ప్రజలు చూస్తూ ఊరుకోరని పుట్ట మధును హెచ్చరిస్తూ పద్దతి మార్చుకోక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పత్రిక ముఖంగా నాయకులు హెచ్చరించారు.

👉 పదేపదే 40 సంవత్సరాలు బానిసలు, బానిసలు అని మాట్లాడుతున్నావ్ పుట్ట మధు ఒకటి చెప్తున్నాం ఇక్కడి ప్రాంత ప్రజలు 40 సంవత్సరాల నుంచి ఎందుకు ఆ కుటుంబాన్ని గెలిపిస్తున్నారనేది నువ్వు యాది చేసుకోవాలి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ రాత్రింబవళ్లు ఈ మారుమూల ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో మా నాయకుడు శ్రీధర్ బాబు  కృషి చేస్తున్నారని వారన్నారు.

👉 రానున్న రోజుల్లో పుట్ట మధు నీ పుట్ట పలుగుడు ఖాయం, ఈ ప్రాంత ప్రజలందరూ నీకు బుద్ధి చెప్పి నీ తట్ట బుట్ట సదురుకొని ఈ మంథని ప్రాంతం నుంచి తరిమి కొడతారని హెచ్చరిస్తా ఉన్నాం.

👉 నీ పెళ్ళి ఎట్లా జరిగిందో అన్ని మాకు తెలుసు కదా, ఆనాడు ఏమి లేని నువ్వు వందల కోట్లు ఎలా సంపాదించావు వెంకటాపూర్ లో వందల ఎకరాలు, ఫ్లాట్లు,కార్లు విలాసమైనంత  భవనాలు ఎక్కడి నుండి వచ్చాయో ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

👉 మంత్రి శ్రీధర్ బాబు  తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో తెలంగాణ వచ్చిందని టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి ఆప్రజాస్వామ్యంగా రామ్ రెడ్డి కి దాదాపు పది సంవత్సరాలు పార్టీ నడిపించిన మీ కవితక్క దగ్గరకు డబ్బుల మూటలు పట్టుకెళ్ళి రాంరెడ్డికి రావాల్సినటువంటి సీటును తెలంగాణ సెంటిమెంటుతో  తెచ్చుకుని గెలిచినా నువ్వు మాట్లాడుతున్నావా మధు అని వారు ప్రశ్నించారు.

👉 నువ్వు పదే పదే శ్రీధర్, శ్రీధర్ అని  ఏకవచనంతో మాట్లాడుతున్నావ్ నిన్ను అరె పుట్ట మధు అనలేక కాదు, మా నాయకుడు అందరిని మర్యాదగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని క్రమ పద్ధతిలో వెళ్లాలని సూచిస్తున్నారు కాబట్టి మేము ఆగుతున్నాం. అదే మా యువ నాయకులు శ్రీను బాబు  ఒక్క సైగ చేస్తే యూత్ కాంగ్రెస్ నాయకులు నిన్ను తరిమితరిమి కొడతారు అని గుర్తు పెట్టుకో మధు తస్మా జాగ్రత్త. అంటూ హెచ్చరించారు.

👉 ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, చీమల దండులాగా ఏకమై, “మేము సైతం” అని చెప్పి, పుట్టలో వచ్చే పుట్ట నుండి పుట్టను పలగొట్టే విధంగా స్పందించేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

👉 పుట్ట మధు, ఖబర్దార్..


చాలా సందర్భాలలో మేము చెప్పినట్టే—నీ పుట్ట పలుకుతుంది. రాబోయే రోజుల్లో ఆ పుట్ట పలగడం ఖాయం.

👉 నువ్వు ఈ ప్రాంతంలో పెట్టే బేడా చదురుకొని వెళ్లడం ఖాయం. అది గోతి ఎవరో తవ్వుకోరు—నువ్వే తవ్వుకుంటున్నావు. ఆ గోతి నీ గోతి; కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గరపడ్డాయి. అని ఆరోపించారు.

👉 నువ్వు అనుచితంగా మాట్లాడుతూ, మా నాయకుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి చరిత్ర తెలుసు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నావు. “ఇంట్లో తిన్నావు” అంటూ మాట్లాడుతున్న తీరు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నువ్వు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో, అది సంస్కారానికి విరుద్ధం.

👉 నువ్వు “అరే” అని మాట్లాడవచ్చు. మేము కూడా అలాగే మాట్లాడగలము. కానీ మాకు ఆ సంస్కృతి నేర్పలేదు. మా నాయకులు శ్రీధర్ బాబు  అడుగుజాడల్లో నడుస్తున్నాము. మా అమ్మానాన్నలు గానీ, దుద్దిళ్ల కుటుంబం గానీ మాకు నేర్పిన సంస్కృతి—గౌరవం ఇవ్వడం, గౌరవం పొందడం.

👉 ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో నీ ఇంటి పైన దాడి చేయడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ మా నాయకులు “వద్దు” అని వారించారు. వాడు తప్పు చేస్తే మనం తప్పు చేయాల్సిన అవసరం లేదని చెప్పి, శాంతిభద్రతలను కాపాడాలని మాకు హితబోధ చేశారు. అంటూ వారు పేర్కొన్నారు.

👉 *అందుకే అంబేద్కర్ సాక్షిగా, నీకు బుద్ధి చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడైనా “అరే తొరే” అనే పదాలు ఉన్నాయా? చూపించగలవా? అంటూ ప్రశ్నించారు

👉 *రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తిరిగి, తెలంగాణకు నిధులు తీసుకొచ్చి, కంపెనీలు ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్య తగ్గించేందుకు రోజుకు 20 గంటలు పని చేసే మా నాయకులు శ్రీధర్ బాబు ను నువ్వు “అరే తొరే” అని మాట్లాడే అర్హత నీకు లేదు. అని అనుగ్రహం వ్యక్తం చేశారు.

👉 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పేరు నీ నోటి నుండి రావడానికి నువ్వు అర్హుడివి కాదు. ఇంకొకసారి మా నాయకుల కుటుంబం గురించి మాట్లాడితే—ఇందాక సోదరుడు అయ్యేలి ప్రసాద్  చెప్పినట్టుగా—అన్నీ బయటపెట్టే రోజు కూడా వస్తుందని హెచ్చరిస్తున్నాను. పేర్కొన్నారు.

👉 ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే, ముందు వరుసలో మా నాయకులే ఉంటారు. తరిమి కొడతారు. ఖబర్దార్ బిడ్డా ఇప్పటివరకు ఓపికతో, సహనంతో నిలబడ్డాము. ఆ ఓపికను పసికట్టుకొని మరీ మాట్లాడితే, ఫలితం వేరేలా ఉంటుంది అని స్పష్టం చేస్తున్నామన్నారు.

👉 నిన్న మాట్లాడిన తర్వాత, “ఇంట్లో ఒక్కడినే ఉంటే దాడి చేస్తారు” అని చెప్పి, ఈరోజు నీ ఇంటి వద్ద 50–100 మందిని కాపలాగా పెట్టుకున్నావు. అంత పిరికివాడివి నువ్వు! కానీ మేము అలా చేయలేదు. అవసరమైతే 50–100 కాదు, 500 మందితో కూడా వస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.ఇంకొకసారి అవాకులు చవాకులు మాట్లాడితే—ఖబర్దార్ బిడ్డా అని నాయకులు తమ ప్రసంగాలు  హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు, సర్పంచులు,మార్కెట్ కమిటీ చైర్మన్లు,నూతన సర్పంచ్లు, బ్లాక్ కాంగ్రెస్,సీనియర్ కాంగ్రెస్,నాలుగు మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ నాయకులు, దుద్దిళ్ళ కుటుంబ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.