👉 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా !
J.SURENDER KUMAR
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని, ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఉమ్మడి లక్ష్యాలను పంచుకుంటూ వారితో కీలక చర్చలు జరిపారు.
హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ ని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు.

తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధిని లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి అగ్రనేతలకు ముఖ్యమంత్రి వివరించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , రాష్ట్ర ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.
