రాష్ట్రపతి ఎట్ హోమ్ కు గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి !

J .SURENDER KUMAR,

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  ఆదివారం ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు.

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.