👉 తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80 సంవత్సరాలు వేడుకలలో…
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఉపాధ్యాయులపై మరింత బాధ్యత ఉందని సమాజ ఉద్ధరణలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేని కీలక పాత్ర, దేశ భవిష్యత్తును తరగతి గదులలోనే ఉపాధ్యాయులు తీర్చిదిద్దే గురుతర బాధ్యతను వారు నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ నాగోల్ లోని సాయిరాం గార్డెన్స్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80 సంవత్సరాలు వేడుకలలో.. మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

నా రాజకీయ జీవితంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నా రాజకీయ జీవితంలో తొలి మొదటి సంతకం ఉపాధ్యాయుల పదోన్నతుల కు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయడం జరిగిందని ఆ విధంగా నాకు ఉపాధ్యాయులతో దాదాపు రెండు దశాబ్దాల సంబంధం, అనుబంధం ఉందన్నారు.
👉 రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో నూతనంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను సర్వహంగులతో నిర్మిస్తున్నామని విద్యా వ్యవస్థలో ఇది పెను మార్పును తీసుకువచ్చే అంశమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలినాలలో ఎన్నికలలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రాష్ట్రంలో 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని 10 సంవత్సరాలుగా లేని బదిలీలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు.
👉 కొన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరించలేకపోయినా, ఆర్థికపరమైన అంశాలను గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నామని త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని పెండింగ్ సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.
👉 బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా ఉన్నారని వారికి నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు.
👉 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే మెగా డీఎస్సీ ని నిర్వహించి కేవలం నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో 11వేల ఉపాధ్యాయులను భర్తీ చేయడం జరిగిందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
👉 రాష్ట్రంలో విద్యా బడ్జెట్ లో 30% కేంద్ర జిడిపి లో 6% బడ్జెట్ ను కేటాయిస్తే తప్ప అనుకున్న రీతిలో విద్యా విధానం గాడిలో పడదని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
