👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఎనలేని నమ్మకం, విశ్వాసంతో మీకు ఓట్లు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజల రుణాన్ని గ్రామాభివృద్ధి రూపంలో చూపించి ప్రజల రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులపై ఉందని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా స్థాయి నూతనంగా గౌడ కుల స్తులు సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సబ్యులుగా ఎన్నికైన సందర్బంగా వారిని దేవిశ్రీ గార్డెన్స్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తోకలిసి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా గౌడ కులస్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం ఆనందకరమని, ఇది వారి ఐక్యతకు, సామాజిక చైతన్యానికి నిదర్శనం అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో అన్ని వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మంత్రి అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
ఈకార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, గౌడ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొన్నారు.
