J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆమెకు అందజేశారు.
👉 తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విశేషాలను సోనియా గాంధీకి తెలిపారు.
👉 ప్రజా పాలనలో గత రెండేండ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
👉 ఈ సందర్భంగా, తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి దూరదృష్టిని సోనియా గాంధీ అభినందించారు.
👉 తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, సోనియా గాంధీ ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.
