సమ్మిట్ ఆహుతులకు స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణను ఆర్థిక ప్రగతి పథంలో నడిపించడానికి బృహత్తరమైన ప్రణాళికలతో, రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్న తరుణంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 కు హాజరవుతున్న ప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్వాగతం పలుకుతున్నారు.

👉 అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావిస్తున్న ప్రజా ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ఆచరణ సాధ్యమయ్యే పటిష్టమైన వ్యూహంతో తెలంగాణ రైజింగ్ విజన్ -2047 దార్శనిక పత్రాన్ని (విజన్ డాక్యుమెంట్) రూపొందించింది. ఈ దార్శనిక పత్రం రూపకల్పనలో ఎంతో మంది నిపుణులు, సంస్థలు, నిష్ణాతులు తమ సహాయ సహకారాలను  అందించారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు.

👉 తెలంగాణ సమగ్రాభివృద్ధికి తమవంతుగా ప్రభుత్వంతో కలిసి నడిచే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు. తెలంగాణను దేశంలోనే ఒక ఉన్నత శిఖరాన నిలపాలన్న సంకల్పానికి తోడ్పాటును అందిస్తున్న పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారులకు స్వాగతం.

👉 సంకల్పం మంచిదైనప్పుడు తలపెట్టిన కార్యం విజయవంతమై ఫలితాలు దక్కుతాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగస్వాములవుతున్న ప్రతినిధులు అందించే సలహాలు, సూచనలతో లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తుంది.

👉 సమున్నతమైన లక్ష్య సాధనలో తెలంగాణకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.