తెలంగాణ చైతన్యమైన ఓ యువ రాష్ట్రం!

👉 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో..

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

తెలంగాణ ఓ చైతన్యవంతమైన యువ రాష్ట్రం,  ఇది ఎప్పుడూ సమ్మిళితమైన అభివృద్ధిని విశ్వసిస్తుంది. మన సమాజంలోని అన్ని వర్గాలు ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీలు, వికలాంగులు, వృద్దులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు మరియు జనాభాలోని గణనయ భాగమైన అన్ని ఇతర వర్గాలను కలుపుకొని వెళ్ళడం ద్వారానే నేటి ఈ రాష్ట్ర ప్రగతి సాధించబడింది అని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

తెలంగాణను ఆర్థిక ప్రగతి పథంలో నడిపించడానికి బృహత్తరమైన ప్రణాళికలతో, రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్న తరుణంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..

నిజమైన అభివృద్ధి కేవలం ఆర్థిక సూచికల ద్వారానే కాకుండా, బడుగు బలహీన వర్గాల సామాజికంగా, ఆర్థికంగా ఎంతవరకు ఈ ‘అభివృద్ధి’ అనే ప్రధాన ప్రవాహంలో సమీకృతమయ్యాయో అనే మానవీయ కోణంలో కూడా కొలవబడుతుంది  అని మంత్రి అన్నారు.


👉 భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నపుడు, ప్రతి పౌరునికి విద్య, నైపుణ్యాలు, గౌరవం మరియు స్థిరమైన జీవనోసాధి లభించేవిధంగా Vision-2027 అనే దార్శనికతని రూపొందించడానికి ఈ ఆలోచన మాకు స్ఫూర్తి నిచ్చింది అని అన్నారు.

👉 ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మేము సమానత్వం, ప్రాప్యత, డిజిటల్ పరివర్తన మరియు అవసరమైన మద్దతును అందించడం అనే వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము అన్నారు.


👉 ప్రతి పౌరుడు గౌరవం, అవకాశం మరియు వివక్ష లేని జీవితానికి అర్హుడు అనే సాధారణ నమ్మకం పై మా విజన్ 2047 నిర్మించబడింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధికి జాతీయ నమూనాగా మారాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము .


👉 ఇక్కడ అభివృద్ధి పంచుకోబడుతుంది, న్యాయం హామీ గా ఇవ్వబడుతుంది మరియు ప్రగతిని కొద్దిమంది మాత్రమే కాకుండా అందరూ సంబరంగా స్వేచ్ఛగా చేసుకుంటారు.


👉 తెలంగాణ సంక్షేమ విజన్-2047 ను సాధించడానికి ఉన్న అన్ని మార్గాలపై వక్తలు అందరూ చర్చించి, వాటిని అమలు చేసి విధానాలను సూచిందాలని నేను మనవి చేస్తున్నాను అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ తన ప్రసంగాన్ని ముగించారు.