👉 సీఎం రేవంత్ రెడ్డికి పంపిన సందేశంలో..
J.SURENDER KUMAR,
తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.
👉 ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పురోగతికి దోహదపడటానికి చేస్తున్న అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి కి అభినందనలు తెలిపారు. సదస్సు విజయవంతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

👉 తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక, ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలసిన వారికి ఈ సదస్సు ఒక వేదికగా దోహదపడుతుందని సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిన సందేశంలో పేర్కొన్నారు.
👉 అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ–వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి సదస్సు మరింత తోడ్పడుతుందని అన్నారు. సదస్సులో పాల్గొంటున్న వారందరికీ సోనియా గాంధీ శుభాభినందనలు తెలిపారు.
