విద్యార్థులను అదుపులోకి తీసుకున్న ఆంధ్ర పోలీసులు !

J.SURENDER KUMAR,

మారేడుమిల్లి ఎన్ కౌంటర్ పై నిజ నిర్ధారణకు వెళ్లిన తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులను శుక్రవారం ఉదయం  ఆంధ్రప్రదేశ్ పోలీస్ లు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
  ఉదయం  14 మంది విద్యార్థుల‌ బృందాన్ని అదుపులోకి తీసుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.


రాజ్యాంగబద్ధంగా నిజనిర్దారణకు  వెళ్లిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం.  మమ్మల్ని భేషరతుగా విడుదల చేసి నిజనిర్ధరణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంటూ విద్యార్థులు పోలీసులతో వాదనలకు దిగారు.
గుర్తింపు కార్డులు (ఐడీలు) పరిశీలించి పంపిస్తామంటూ పోలీసులు. విద్యార్థులను చింతూరు స్టేషన్ కు తరలించారు.


పోలీస్ స్టేషన్ ఆవరణలోనే విద్యార్థులు తమను పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వివరాలను ప్రచార మాధ్యమాలకు ప్రసారం చేస్తున్నారు. మాకొద్దు మాకొద్దు.. మావోయిస్టు మాకొద్దు అంటూ నినాదాలు ఇస్తూ గ్రామస్తుల ముసుగులో  పోలీసు కిరాయి మనుషులతో ప్లే కార్డులతో అడ్డుకున్నారని  విద్యార్థులు వివరిస్తున్నారు.