👉 ఇంటరాక్షన్ మీటింగ్ విత్ స్టూడెంట్స్ కార్యక్రమంలో..
J . SURENDER KUMAR,
జగిత్యాల రూరల్ మండలం పొలస గ్రామంలో ప్రోపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఇంటరాక్షన్ మీటింగ్ విత్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ కాలేజ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వీసీ జానయ్య తో కలిసి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
భారత్ వ్యవసాయ ఆధారిత దేశం అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. కళాశాల వైస్ ఛాన్సలర్,జానయ్య విజన్ ఉన్న విద్యావేత్త మంత్రి అన్నారు.

వ్యవసాయ కళాశాలకు సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరుగుతుందని, గతంలో వ్యవసాయ కళాశాలలో సరైన ప్రొఫెసర్లు లేరు అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి స్పందించి వైస్ ఛాన్సలర్ ను నియమించి కళాశాల మౌలిక వసతులు కల్పనకు తగు చర్యలు తీసుకున్నట్టు మంత్రి అన్నారు.
ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా ₹ 7 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. మరిన్ని నిధులు కావాలనీ కోరడం జరిగిందని అట్టి నిధులను తప్పకుండా విడుదల చేస్తామని, విద్యార్థులు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని జరిగింది వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

విద్యార్థుల భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్న తప్పకుండా తమ సహకారం ఉంటుందని, షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థుల విషయంలో వారి భవిష్యతుల విషయంలో ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు.
