👉 పంపిణీ చేయని ఉత్తర్వులు !
👉 ‘ ఉప్పు’ కథనంతో స్పందించిన యంత్రాంగం !
J SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణ ఉత్తర్వులు ఉద్యోగులకు పంపిణీ చేయకుండా ధర్మపురి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భద్రంగా ఉంచారు.

పంచాయతీ ఎన్నికల విధుల గైరాజర్ లో నిర్లక్ష్యం ఎవరిది ? అనే శీర్షికన శుక్రవారం ప్రచురితమైన ‘ఉప్పు’ వార్తా తో జిల్లా ఎన్నికల యంత్రాంగం స్పందించింది. దీంతో మొదటి విడత ఎన్నికల విధుల నిర్వహణ ఉత్తర్వులు అంగన్వాడి టీచర్లకు పంపిణీ చేయని విషయం వెలుగు చూసింది.
👉 వెలుగు చూసింది ఇలా..
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల విధులు కేటాయించగా 89 మంది ఎన్నికల సిబ్బంది గైర్హాజర్ కావడంతో గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

89 మంది ఉద్యోగులలో ధర్మపురి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ICDS) పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొందరు అంగన్వాడి టీచర్ల పేర్లు ఉన్నాయి. వీరికి పంచాయతీ ఎన్నికల నిర్వహణ మొదటి విడత, రెండో విడత, మూడో విడత, సమాచారం లేదు. దీంతో వారు ఎన్నికల విధులకు హాజరు కాలేదు.

మండల కేంద్రాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు అంగన్వాడి టీచర్లకు ఎన్నికల నిర్వహణ ముందస్తు సమాచార లేఖ గాని ,ఎన్నికల విధులు కేటాయించిన మండలం, తదితర వివరాలు ఎన్నికల విధులు నిర్వహించే గ్రామ పంచాయతీల సమాచార ఉత్తర్వులు వీరికి జారీ చేయలేదు కలెక్టర్ జారీ చేసిన షో కాస్ నోటీస్ అంగన్వాడీ టీచర్లు తమకు ఎన్నికల విధుల నిర్వహణ సమాచారమే లేదని వ్యక్తం చేసిన ఆవేదన ఉప్పు ప్రచురించింది.

స్పందించిన ధర్మపురి మండల పరిషత్ అధికార యంత్రాంగం హుటాహుటిన ఓ ఉద్యోగి ద్వారా ఎన్నికల విధుల నిర్వహణ ఉత్తర్వులను స్థానిక ఐసిడిఎస్ కార్యాలయానికి పంపించారు. మీ శాఖ పరమైన మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదని, అందుకే పంపిణీ చేయలేదని అధికారి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఇతర మండలలో ఉద్యోగులకు ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు ఏ పద్ధతిలో పంపిణీ చేశారో ? కలెక్టర్ విచారణ జరిపితే ఈ అంశంలో ఎవరి నిర్లక్ష్యం, ఎవరి అలసత్వం అనే అంశాలు వెలుగు చూస్తాయి.
