యుద్ధ ప్రాతిపదికన లిఫ్ట్ మరమ్మత్తులు పూర్తి చేయండి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

గోదావరి నది ఆనుకొని ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి  సకాలంలో పనులు పూర్తి చేయాలని  ప్రిన్సిపల్ కార్యదర్శి  రాహుల్ బొజ్జ కు ఫోన్ చేసి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.

ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుసంధానమైన విద్యుత్  సబ్ స్టేషన్ శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.

విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటనపై  మంత్రి స్పందించారు, లిఫ్ట్ ప్రాంతాన్ని స్థానిక మండల నాయకులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. వారం రోజులలో మరమ్మతులు పూర్తిచేసే సాగునీరు అందిస్తామని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు.