J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా, ధర్మపురి మరియు జగిత్యాల నియోజకవర్గం లకు మంజూరు కాబడిన యంగ్ ఇండియా స్కూల్ కు సంబంధించి మంజూరు కాబడిన యంగ్ ఇండియా స్కూల్స్ కు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రభుత్వం ద్వారా ₹200 కోట్ల చొప్పున ₹400 కోట్లు మంజూరు కాబడిన మరియు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జగిత్యాల కలెక్టరేట్ లోని మిని మీటింగ్ హాల్ లో మంత్రి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ఇరిగేషన్ శాఖ వారికి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే విధంగా ప్రణాళికల రూపొందించాలని దానికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలలో నగర అభివృద్ధి క్రింద మంజూరు కాబడిన నిధులు ₹15 కోట్ల చొప్పున మంజూరు చేయబడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మరియు దానికి కావలసిన ఏజెన్సీలను నియమించి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ లను కోరారు.
ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి డిగ్రీ కళాశాల నూతన భవనం కొరకు మంజూరు కాబడిన నిధులను వినియోగించుకుంటూ వాటికి సంబంధించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్లాన్ లను నిర్మించి నిర్మాణం కొరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్,ఆర్డీవోలు, జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
