👉 ధర్మపురి మున్సిపల్ పరిధిలో ₹ 2 .54 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ ప్రజలు అన్నగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారని నియోజకవర్గంలోని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఆదివారం ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ₹ 2. 54 కోట్ల తో చేపట్టిన పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు ఇందులో సీఎస్ఆర్ నిధులు ₹ 50 లక్షలు కాగా స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) ₹ 2 కోట్ల 4 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు.

👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

నన్ను ధర్మపురి నియోజకవర్గ నుంచి గెలిపించి అసెంబ్లీకి పంపించారని గెలిచిన ఓడిన ధర్మపురి ప్రజల మధ్య ఉన్నానని మంత్రి అన్నారు. ధర్మపురి పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఇందులో భాగంగానే కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.
👉 ధార్మిక క్షేత్రమైన ధర్మపురిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి స్థానికుల సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

👉 గత ప్రభుత్వ కాలంలో మూతపడిన నైట్ కళాశాలను తెరిపించడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. ధర్మపురికి రెవిన్యూ డివిజన్ తీసుకురావడమే కాకుండా బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 2027 నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఆరు నెలల ముందుగానే పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేద్దాం అని అన్నారు. ధర్మపురి పట్టణాన్ని ఒక అందమైన ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దుతానాన్ని మంత్రి తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
👉 భూమి పూజలు, శంకుస్థాపనలు !

షాది ఖానా ,8 వ వార్డు పోచమ్మ ఆలయ నిర్మాణ ఇబ్రహీం మసీద్ మిగులు పనుల నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ పెద్దమ్మ గుడి మిగులు పనుల తెనుగువాడ పోచమ్మ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ 10 వ వార్డులోని సాఫీయా మసీద్ మిగులు పనుల భూమి పోచమ్మ ఆలయ నూతన ఆర్యవైశ్య భవన నిర్మాణ, స్వర్ణ కార సంఘ భవన నిర్మాణ, పద్మశాలి సంఘ భవన నిర్మాణ, బ్రాహ్మణ కర్మ భవన నిర్మాణ , మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ, దుర్గ కాలని కమ్యూనిటీ హాల్ , మేర సంఘ భవన నిర్మాణ, మ్యాదరి సంఘ భవన నిర్మాణ, అంబేద్కర్ సంఘ భవన, కభారస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణ, చింతామణి చెరువు కట్ట సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్ పనులకు భూమి పూజలు శంకుస్థాపనలు మంత్రి చేశారు.

👉 మంత్రి పర్యటన సందర్భంగా ధర్మపురిలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం పెన్షన్ భవనం నిర్మాణం చేసుకుంటామని కోరగా రూపాయలు ఐదు లక్షలు నిధులు వెచ్చించడానికి మంత్రి హామీ ఇచ్చారు.
