👉 కోరుట్ల ,మెట్ పెల్లి పట్టణంలో ₹ 37 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజలు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
మహిళా సోదరీమణుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మహిళా సోదరిమణులను ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళలను ఆర్థికంగా, వ్యాపార పరంగా మరియు అన్నిరకాలుగా ముందంజలో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్ పెల్లి మున్సిపల్ పరిధిలోని మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు శనివారం పట్టణ పేదరిక నిర్ములన సంస్థ, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణి కార్యక్రమం నిర్వహించి కోరుట్ల పట్టణ మహిళా సంఘాలకు ₹ 2,00,62,348 మెట్ పెల్లి పట్టణ మహిళా సంఘాలకు ₹1,22,02,227రూపాయల జంబో చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల శాసనసభ్యులు సంజయ్ , జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి చెక్కు అందజేశారు.
కోరుట్ల మున్సిపల్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు సెంట్రల్ లైటింగ్ వంటి ₹ 18.70 కోట్ల అంచనా నిధులతో పనులకు
మెట్ పెల్లి మున్సిపల్ పరిధిలో వాటర్ డ్రైన్స్, సిసి రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ఇంటర్నల్ సిసి రోడ్లు వంటి ₹18.70 కోట్ల నిధులకు అంచనా పనులకు శంకుస్థాపన చేశారు
👉 ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంతకం రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకం ఉచిత బస్సు మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించిన ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేశారని మంత్రి అన్నారు..
👉 తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను విద్య,వైద్యం మరియు మహిళాభివృద్ధికి ఇస్తుంది.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధిచేయాలనే ఉద్ధేశ్యంతో అన్నిరకాల పథకాలను మహిళల పేరుమీదనే అమలు చేస్తుంది అని మంత్రి అన్నారు.

👉 ఇందిరమ్మ ఇండ్లు ,సన్న బియ్యం , మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం , 200 యూనిట్ల ఉచిత కరెంట్ ,సోలార్ పవర్ ప్లాంట్ లు ,పెట్రోల్ బంక్ , మహిళలకు వడ్డీ లేని ఋణాలు,అద్దెకు బస్సులు, ఉచిత స్కూల్ యూనిఫామ్స్ అందిస్తుంది అని మంత్రి అన్నారు.
👉 మహిళలకు కు నైపుణ్య శిక్షణ ,సమావేశ నిర్వహణ కోసం, ₹ 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం చేపట్టి త్వరలో ప్రారంభం కాబోతున్నదని అన్నారు.
👉 మున్సిపల్ అభివృద్ధి కి నిధులు మంజూరు చేసినందుకు వివిధ స్థాయి ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. వడ్డీ లేని రుణాలు అందించినందుకు మహిళలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధి కి తోడ్పడుతున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కి ధన్యవాదములు తెలిపారు.

ఈకార్యక్రమంలో కోరుట్ల అసెంబ్లీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, కోరుట్ల, మెట్ పెల్లి ఆర్డీవో లు జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్ మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో, మహిళా సంఘం సభ్యులు, వివిధ స్థాయి ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
