J.SURENDER KUMAR,
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వరించడంతో నాయకులు ఆనందపడడం సహజం.. అయితే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వరించిన గాజంగి నందయ్య, మాత్రం రాజకీయ ఆధిపత్య పోరులో మానసికంగా నలుగుతున్నాడు అని అధికార, ప్రతిపక్ష క్యాడర్ లో చర్చ.
పోరాటాల పురిటిగడ్డ జగిత్యాల రాజకీయముఖ చిత్రంలో సీనియర్ కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీమంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరులో పార్టీ అధ్యక్షుడు నందయ్య ఇరువురి మధ్య సమన్వయానికి సహాయ శక్తుల కృషి చేస్తూ సతమతమవుతున్నట్టు సమాచారం.

2023 శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల జీవన్ రెడ్డి ఓటమి చెందడం, టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్, నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికతో మొదలైన ఆదిపత్య పోరు, మాజీమంత్రి జీవన్ రెడ్డి, ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలోను తీవ్ర దుమారం లేపింది అని చెప్పుకోవచ్చు.
బీ ఆర్ఎస్ నాయకులు, డాక్టర్ సంజయ్ అనుచరుడు చేసిన ఈ హత్యలో ఎమ్మెల్యే సంజయ్ పాత్ర ఉందని నాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బహిరంగంగా చేసిన ఆరోపణలు జగమెరిగిన సత్యం.

గంగారెడ్డి హత్య రోజున జీవన్ రెడ్డి చేపట్టిన నిరసన లో పాల్గొన్న మంత్రి నాటి ప్రభుత్వ విప్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లక్ష్మణ్ కుమార్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ మీకు మీ పార్టీకి ఓ దండం ‘ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం పై ధ్వజమెత్తుతూ సోనియా, రాహుల్ గాంధీకి, గంగారెడ్డి హత్య ఉదాంతం పై డాక్టర్ సంజయ్ కుమార్ చేరికపై జీవన్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

పోలాస ,బీర్పూర్, ఆలయాల పాలకవర్గ నియామకంలో టిఆర్ఎస్ నాయకులకు పదవులు, చైర్మన్ పదవి ఎలా ఇస్తారు అంటూ జీవన్ రెడ్డి , మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.
మరో సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి మేము పట్టేదారులము, కౌలుదారులము కాదు, అంటూ, ధర్మ పరిరక్షణకు నాడు రాముడు రావణాసురుడి పది తలలు నరికాడు, భారత రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే మనము ఒక్కడి తల నరకమా ? అంటూ కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు విధితమే..

ఇదే సమావేశంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వేరు ? కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే సహించం, పది సంవత్సరాలు బిఆర్ఎస్ తో పోరాడి సాధించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా కార్యకర్తల కష్టార్జితం కాంగ్రెస్ జెండా మోసిన వాడికి పార్టీ టికెట్లు ఇవ్వాలి, అంటూ హెచ్చరించిన విషయం విధితమే.
అడ్డదారులలో వచ్చి టికెట్టు తీసుకుంటామంటే అడ్డంగా తొక్కుతామంటూ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ ను ఆయన అనుచర వర్గం కు హెచ్చరిక చేసినట్టుగా చర్చ. కార్యకర్తల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య తో పాటు పార్టీ కత్తి వెంకటస్వామి కూడా పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన వారిలో ఎమ్మెల్యే సంజయ్ , మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులుగా ముద్ర తో పాటు గ్రామాలలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి అనేది అందరికీ తెలిసిన విషయమే.

పార్టీ గుర్తులపై త్వరలో జరగనున్న మున్సిపల్ జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు సూచించిన ఏ అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తారో ? ఏ అభ్యర్థులను తిరస్కరిస్తారో ? అనేది చర్చ.
👉 జిల్లా కార్యవర్గం ఏలా ఉంటుందో ?

గురువారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జగిత్యాల జిల్లా కార్యవర్గంలో ఎవరి అనుచర గణం కు చోటు లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
ఆయా జిల్లాలకు అధిష్టానం అధ్యక్షుల నియామకం మినహా పూర్తిస్థాయిలో కార్యవర్గాన్ని నియమించలేదు, ప్రకటించలేదు. గురువారం జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో డిసిసి అధ్యక్షులు పూర్తిస్థాయి కార్యవర్గానికి సంబంధించిన జాబితాను పిసిసి అధ్యక్షుడికి అందించాలని పార్టీ అధిష్టానం ముందస్తుగా జిల్లా అధ్యక్షులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ తదితర కీలక నాయకులు పాల్గొంటారు అనేది చర్చ. విస్తృతస్థాయి సమావేశంలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్య పోరు సమస్య సమసి పోతుందో ? లేదో ? వేచి చూడాల్సిందే.
