అగ్ని ప్రమాద బాధితుడిని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 ప్రభుత్వ పరంగా ఆదుకుంటా మంత్రి హామీ !

J.SURENDER KUMAR ,

ధర్మపురి పట్టణంలో కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదానికి గురి అయిన స్టార్ బిర్యాణి సెంటర్ ను యజమాని షబ్బీర్ ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.

ఈసందర్భంగా ప్రమాద వివరాలను మంత్రి తెలుసుకున్నారు. గతంలో బిర్యాణి సెంటర్ యాజమానికి సంబంధించిన టెంట్ సామాగ్రి సైతం అగ్ని ప్రమాదానికి గురి అయిందని, ప్రస్తుతం బిర్యాణి సెంటర్ లోను  జరిగిన అగ్ని ప్రమాదం వెనుక ఏమైన కుట్ర దాగి ఉందో విచారణ చేపట్టాలని ధర్మపురి సీఐని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.

రెండు ప్రమాదాల్లో సుమారుగా ₹ 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు కన్నీరు మున్నీరుగా  రోధించాడు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ట్రాన్స్ కో సీ అండ్ ఎండీకి ఫోన్ లో మాట్లాడిన ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి ఆర్ధిక సహయం అందించాలని కోరారు.