ఆంజనేయ స్వామి తమ ఇంటి ఇలవేల్పు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ !

👉 కొండగట్టులో వాయుపుత్ర సడన్ ధర్మశాల నిర్మాణానికి శంకుస్థాపన !

👉 ₹ 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి టిటిడి నిధులు!

👉 కొండగట్టు లో ఎపి డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ పర్యటన !

J SURENDER KUMAR,

ఆంజనేయ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని ఆయన దయతోనే తనకు పునర్జన్మ లభించిందని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో కొండగట్టు ఆలయ అర్చకులు, అధికారులు తన దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే అభివృద్ధి పనులకు మాట ఇచ్చినట్లు కొండగట్టు లో ఎపి డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు లో శ్రీ ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు టిటిడి బోర్డు చైర్మన్ బి.ఆర్ నాయుడు, ప్రముఖ సినీ దర్శకుడు గబ్బర్ సింగ్ ఫ్రేమ్ సంగనభట్ల హరి శంకర్, మరియు టి టి డి సభ్యులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల ₹ 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి వాయుపుత్ర సడన్ ధర్మశాల నిర్మాణానికి శంకుస్థాపన పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.

👉 రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానం !

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  హెలికాప్టర్ ద్వారా జేఎన్టీయూ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన  రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హెలిప్యాడ్ వద్దకు వెళ్లి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన స్వాగతించారు. ఆలయ ప్రాంగణంలో గార్డ్ ఆఫ్ ఆనర్ ప్రదానం చేశారు మంత్రితోపాటు  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ టిటిడి సహకారంతో  ₹35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న  దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేశారు.

👉.ఈ సందర్భంగా ఏపి డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….

కొండగట్టు ఆంజనేయ స్వామి దయతో రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టడం హర్షనీయం అన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షణకు మార్గం సుగమం చేసేందుకు అవసరమైతే తానే స్వయంగా కర సేవకుడిని అవుతానని మాట ఇచ్చారు. 

భవిష్యత్తులో సైతం ఆలయ అభివృద్ధికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి  నిధులు కేటాయించినందుకు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు మరియు  టిటిడి కి నా ధన్యవాదాలు అని అన్నారు. కొండగట్టు‌ అంజన్న స్వామి‌ అజ్ఞ వల్లే …అందుకే టిటిడి వారు అమోదం లభించిందని తెలిపారు.

కొండగట్టు అభివృద్ధి కి‌ తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపోందించడం అభినందనియం అని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఘనంగా స్వాగతం తెలిపిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గిరి ప్రదిక్షణ తెలుగు రాష్ట్రాలకి, దేశానికి కూడ రక్ష అని అన్నారు. కొండగట్టు గిరి ప్రదిక్షణ కి అందరం కలిసి కరసేవా చేద్దాం అని తెలిపారు. అలాగే కొండగట్టు ఆలయ అభివృద్ధికి అందరు కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు.

👉 రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ఉత్తర తెలంగాణ పుణ్యక్షేత్రాల్లో ప్రధానమైన కొండగట్టు ఆంజనేయ స్వామి అలయంకు ఏపి ఉప ముఖ్యమంత్రి వచ్చి ₹ 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి టిటిడి నిధులు అందివ్వడం కృతజ్ఞతలు తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అలయం అభివృద్ధి చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి అలయంకు వచ్చే దీక్ష విరమణ, దర్శనం కొరకు వచ్చే భక్తుల కొరకు గదుల వసతి సముదాయానికి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని భవిష్యత్తులో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం లాగా అభివృద్ధి చేస్తామని పునరుద్ధ్ఘటించారు. ₹ 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి టిటిడి నిధులు సమకూర్చడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

👉 చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మాట్లాడుతూ…

కొండగట్టు ఆంజనేయ స్వామి అలయంకు ఏపి డిప్యూటీ సిఎం సహకారంతో  ₹35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి టిటిడి నిధులు అందివ్వడం కృతజ్ఞతలు తెలిపారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధిలో పాలు పంచుకున్న ఏపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే గా ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి మరింత ఆలయం అభివృద్ధి చేయడంలో నా వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈకార్యక్రమంలో ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి, బి.మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సీ. చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జిల్లా  అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజా గౌడ్ , జిల్లా అధికారులు, ఆలయ ఈ.వో, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది  మరియు తదితరులు పాల్గొన్నారు.