అన్ని మున్సిపాలిటీలు హస్తగతం కావాలి !

👉 పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలోని అన్ని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తగతం కావడానికి మున్సిపాలిటీలలో  కాంగ్రెస్ పార్టీ శ్రేణులను  సమన్వయం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దిశా నిర్దేశం చేశారు.

హైదరాబాదులో మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేషన్ సమావేశం గురువారం జరిగింది. సీనియర్ జూనియర్ నాయకుల మధ్య సమన్వయం,  సీనియార్టీ, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, మంత్రులతో చర్చించాలని  కోఆర్డినేషన్ బృందానికి వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని, ఎవరైనా రెబల్స్ పోటీ చేస్తే వారితో చర్చించి ఒప్పించి విత్ డ్రా చేయించాలని బృందానికి వివరించారు.