బ్రెయిలీ అందులకే కాదు సమాజానికే వెలుగు చూపిన మహనీయుడు !

👉 ఇంటర్ ఆపై కోర్సులకు త్వరలో బ్రెయిలీ లిపిలో పుస్తకాలు !

👉 రాష్ట్రంలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో క్యాలెండర్ ఆవిష్కరణ

!👉 దివ్యాంగులకు  తోడుంటా త్వరలో ఉచిత బస్సు ప్రయాణం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

లూయిస్ బ్రెయిలీ అందులకు మాత్రమే కాదు, సమాజానికే వెలుగు చూపిన మహనీయుడని పేర్కొన్నారు. అంధత్వాన్ని శాపంగా కాకుండా అవకాశంగా మార్చిన వ్యక్తి బ్రెయిలీ అని, ఆయన ఒక వ్యక్తి కాదని… ఒక ఆలోచన, ఒక ఉద్యమమని రాష్ట ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు.


లూయిస్ బ్రెయిలీ 217 వ జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం మలక్ పేటలో నిర్వహించిన కార్యక్రమంలో  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్య అతిథిగా పాల్గొని బ్రెయిలీ విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు సంగీత వైద్య పరికరాలను అందజేసి రాష్ట్రంలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు

👉 ఈ సమావేశంలో మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ ……

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందని మంత్రి తెలిపారు. తాను శాఖ బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు అవుతోందని, ఈ కాలంలో దివ్యాంగుల సమస్యలపై నిరంతర దృష్టి పెట్టి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని చెప్పారు.


👉 తాను  మంత్రి మాత్రమే కాదని, దివ్యాంగులకు అన్నలా తోడుగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పదవ తరగతి వరకే బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులో ఉండటంతో అనేక మంది దివ్యాంగ విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.


👉 ఈ సమస్యపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరిపామని,రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ స్థాయి వరకు బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ దిశగా త్వరలోనే జీవో జారీ చేసి, దివ్యాంగ విద్యార్థులకు పూర్తి స్థాయి విద్యా అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు


👉 దివ్యాంగులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తన పరిధిలో ఉన్న మేరకు వెంటనే పరిష్కరిస్తానని, తన పరిధిలో లేని అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నూటికి నూరు శాతం కృషి చేసి పరిష్కారానికి తీసుకెళ్తానని మంత్రి అన్నారు.


👉 దివ్యగులకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దివ్యాంగులే గౌరవంతో జీవించే శక్తివంతమైన పౌరులని స్పష్టం చేశారు


👉 ఈ సందర్భంగా దివ్యాంగుల బస్సు ప్రయాణ సమస్యపై వేదికపైనుండే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తో  ఫోన్‌లో మాట్లాడారు.దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


👉 లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఆలపించిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రొఫెషనల్ గాయకుల స్థాయిలో విద్యార్థులు పాటలు పాడటం అభినందనీయమని మంత్రి పేర్కొంటూ, ఇందుకు కీలకంగా కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.


👉 దివ్యాంగులకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన గొప్ప వరమని, ఈ సేవ ద్వారా సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని మంత్రి అన్నారు.


👉 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన సమస్యలు, ఉద్యోగ భద్రత, క్యాడర్ స్ట్రెంత్ అంశాలపై బోర్డు మీటింగ్‌లో చర్చించి త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు.


👉 దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వివిధ సంఘాలతో అధికారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.


👉 వికలాంగులకు నేటి ప్రజాపాలన ప్రభుత్వంలో  కోర్టు ఉద్యోగాలను నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చామని, ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చామని
వికలాంగులు స్వయం సమృద్ధి సాధించేలా రాష్ట్రంలో వికలాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఇప్పటికే దాదాపు 6000 గ్రూపులు ఏర్పాటు చేశామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 వికలాంగుల ఉద్యోగుల కొరకు వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ప్రమోషన్ పొందేలా జీవో నెంబర్ 34 ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు.


👉 పోలీస్  శాఖలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉద్యోగాల లో వికలాంగులకు రిజర్వేషన్లు ఇచ్చామని దేశంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులకు అందించే పరికరాలు 40 శాతం బెంచ్ మార్క్ వైకల్యానికి అందిస్తున్నామని, మంత్రి అన్నారు.


👉 ఇద్దరు దివ్యంగుల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు అదనపు ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం మంత్రి గుర్తు చేశారు.


👉 త్వరలోనే వికలాంగులకు ఉచితంగా దాదాపు 8,000 మందికి తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ద్వారా పరికరాలు అందిస్తామని తెలియజేశారు.