👉 ఆర్థిక క్రమశిక్షణ లేదు ప్రజాధనం అడ్డగోలు గా దోచుకున్నారు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, రాష్ట్ర ప్రజాధనం ను అడ్డగోలుగా దోచుకున్న ఫలితమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
👉 జగిత్యాల జిల్లా ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయం బుధవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు..
గత పది సంవత్సరాలుగా రాష్ట్ర సంపద దోపిడీ పాలనకు అలవాటు పడిన బీఆర్ఎస్ కు మా ప్రజా పాలన ప్రభుత్వం జవాబుదారీ పాలన చూపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
👉 కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.
👉 పాలనలో విఫలమై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బీఆర్ఎస్ నేతలు అబద్ధాల రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాల అంశంలో ప్రజలను కావాలని తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్, గతంలో ఈ అంశంపై చర్చకు వస్తే అసెంబ్లీ నుంచి పారిపోయిన చరిత్రను బీఆర్ఎస్ ది అని మంత్రి గుర్తు చేశారు.
👉 కృష్ణ–గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యతతో, చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
👉 సర్పంచ్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్‌కు ప్రజలు చెంపపెట్టు తీర్పు ఇచ్చారని, ఆ పార్టీకి ఇది కేవలం ఆరంభమేనని మంత్రి హెచ్చరించారు.
👉 రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారని స్పష్టం చేశారు. కేటీఆర్ విమర్శలు ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలే తప్ప, వాస్తవాలకు దూరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
