సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

2026 నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కలసి
శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి  నాయకత్వంలో అమలవుతున్న ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకు వస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్,
ఈ సందర్భంగా అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి  దూరదృష్టి గల నాయకత్వం, ప్రజాపక్ష పాలన, అభివృద్ధి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం, ధర్మపురి నియోజకవర్గం, సరికొత్త ప్రగతి దిశగా ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు.

ఈసందర్భంగా ధర్మపురి నియోజకవర్గంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు, అలాగే జిల్లాస్థాయి అధికారులు మరియు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న అధికారులందరికీ మంత్రి లక్ష్మణ్ కుమార్  మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.