👉 దావోస్‌లో యూపీసీ–వోల్ట్ సంయుక్త భాగస్వామ సంస్థతో అవగాహన ఒప్పందం !
J SURENDER KUMAR,
హైదరాబాద్‌ను దేశంలోనే ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం దావోస్‌లో యూపీసీ–వోల్ట్ సంయుక్త భాగస్వామ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది.
👉 నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్‌ల సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పుతుంది.
👉 ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్ , యూపీసీ రిన్యూవబుల్స్ (ఆసియా పసిఫిక్) సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్ , యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్ తో సమావేశమైంది.
👉 ఈ ప్రాజెక్టుకు వచ్చే ఐదేళ్లలో ₹ 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో దాదాపు 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
👉 పెట్టుబడుల సాధనలో మంత్రి శ్రీధర్ బాబు ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందిస్తూ, తెలంగాణ రైజింగ్ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ, అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నెట్ జీరో సిటీ అభివృద్ధే తెలంగాణ విజన్‌లో భాగమని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
