J.SURENDER KUMAR
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజున బిజీబిజీగా గడిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ భేటీ అయ్యారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
👉 వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

👉 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్‌టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యాన్ని పంచుకుంటుంది.

👉 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయెలీ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.
