J.SURENDER KUMAR,
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు, ఘనంగా స్వాగతం పలికారు.

పుణ్యక్షేత్రమైన ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.






కోట్లాది రూపాయలు విలువగల భూమిని విద్యా సంస్థకు దానమిచ్చిన స్వర్గీయ మధ్వాచారీ రాధా బాయి అమ్మ విగ్రహానికి మంత్రులు నివాళులర్పించారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్, ట్రైకార్ మరియు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ లు బెల్లయ్య నాయక్, తిరుపతి జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, ఎమ్మెల్యే లు సంజయ్ కుమార్, విజయ రమణ రావు, మక్కాన్ సింగ్ ఠాగూర్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, TSNPCDL CMD వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు మంత్రులకు స్వాగతం పలికారు.
