J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణాలు, విస్తరణ, తదితర అభివృద్ధి పనుల కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ ₹ 50 లక్షల నిధులు విడుదల చేయించారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సి ఎస్ ఆర్) నిధుల నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘ భవనానికి ₹10 లక్షలు, స్వర్ణకార సంఘ కమ్యూనిటీ హాల్ కు ₹ 10 లక్షలు, మున్నూరు కాపు సంఘ భవనానికి ₹ 10, పద్మశాలి సంఘ భవనానికి ₹10 లక్షలు, గోదావరి నది తీరంలో కర్మకాండల మండపం నిర్మాణానికి ₹ 10 లక్షల నిధులు మంజూరు చేయించారు.

గత కొన్ని నెలల్లో క్రితం ఆయా కుల సంఘాల నాయకులు, సంఘ బాధ్యులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కలిసి నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేయించడంతో కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
