👉 కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు!
👉 ధర్మపురి పట్టణంలో మంత్రి అడ్లూరి ఎన్నికల ప్రచారం !
J SURENDER KUMAR,
మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించి ధర్మపురి పట్టణాన్ని మరింత అభివృద్ది చేయడానికి అవకాశం కల్పించాలని, ధర్మపురి మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
శుక్రవారం ధర్మపురి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాడ వాడల తిరిగి ఓటర్లను కలిశారు.

👉 ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

గడిచిన రెండు సంవత్సరాలుగా ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ధర్మపురి పట్టణం మరింత అభివృద్ది చెందాలంటే మున్సిపాలిటిపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని అన్నారు. మొత్తం 15వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాలను మంత్రి పరిశీలించారు.

👉 కాంగ్రెస్ లో చేరిన వడ్డెర యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి
ధర్మపురి పట్టణానికి చెందిన రాష్ట్ర ఒడ్డెర యువజన సంఘం కార్యదర్శి ఓల్లెపు శంకర్ రాజు శుక్రవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శంకర్ రాజు తో పాటు ఒడ్డెర యువజన సంఘం ధర్మపురి మండల అధ్యక్షుడు తాపళ్ల శంకర్, యువనాయకులు సంపంగి రవి, ఉప్పుల శివ, దండ్ల రాజేశ్, సంపంగి శేఖర్, సంపంగి సంజీవ్, రాజేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
