J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ బుధవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పెద్దపెల్లి శాసనసభ్యులు విజయ రమణా రావు , రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , శ్రీ స్వామివారి నీ దర్శించుకున్నారు.

ముందుగా వారికి దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో మేళ తాళాలతో స్వాగతం పలికిన పిదప దేవస్థానం వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి స్వామి వారి శేష వస్త్ర ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించారు. దర్శనం అనంతరం ఆలయం బయట డిప్యూటీ సీఎంకు ప్రభుత్వ యంత్రాంగం గాడ్ ఆఫ్ హానర్ అందించారు.




వారి వెంట కలెక్టర్ బి సత్య ప్రసాద్ , దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్ , జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ గారు , జగిత్యాల జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు దేవస్థానం అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
