👉 2027 గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జూలై 2027లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ వయోవృద్దులు, వికలాంగులు, మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలసి గోదావరి పుష్కరాల ప్రణాళికపై ప్రాథమికంగా సమీక్షించారు..
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

మున్సిపల్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ మరియు సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ పుష్కరాలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నందున ధర్మపురి పట్టణాన్ని ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
👉 పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని పుష్కరాలపై కలిసి చేపట్టిన ప్రాథమిక సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.
👉 ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు.
👉 పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

👉 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
పుష్కర ఘాట్లకు వచ్చే వారికి ఎలాంటి అవాంతరాలు లేకుండా లింకు రోడ్లు, మరియు ఇతర వసతులు శాశ్వతంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
👉 జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ఉన్న గ్రామాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులకు సూచించారు.
👉 పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.
2015 సంవత్సరంలో 1.50 కోట్లు భక్తులు రాగ ఈసారి 4.50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
👉 ఎంతమంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు.

👉 జిల్లాలో వివిధ అంశాలను ఘాట్లు, రోడ్లు, సానిటేషన్ మరియు పైప్ లైన్లు ఈ అంశాల వారిగా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
👉 గోదావరి నది వెంట పురాతన ఆలయాలను గుర్తించి మరమ్మత్తులు, కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
👉 జిల్లా మంత్రి గా నేను, జిల్లా కలెక్టర్ ఎల్లవేళలా అధికారులకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈరోజు జరిగిన మొదటి సారిగా సమీక్షించిన అంశాలను ఆయా శాఖ అధికారులు అనుసరించి మరో సమీక్ష వరకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు.
👉 పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్ , ఆర్డీవో మధుసూదన్,శిక్షణ డిప్యూటీ కలెక్టర్, సంబంధిత జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
