దివ్యాంగులు ధైర్యంతో ముందుకు సాగాలి !

👉 దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఉచిత ఉపకరణాల పంపిణీ !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

దివ్యాంగులు మనో ధైర్యంతో ముందుకు సాగాలి
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అండగా ఉంటుంది దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల కలెక్టరేట్ లో శుక్రవారం మహిళ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….


ఉచిత ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వాకర్స్, బ్యాటరీ సైకిళ్ళ  పంపిణీ వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు. దివ్యాంగులు సమాజంలో స్వావలంబులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హులైన దివ్యాంగులకు అవసరమైన  స్కూటీలు, బ్యాటరీ వాకర్స్, బ్యాటరీ సైకిళ్ళు , లాప్టాప్ లు,5G ఫోన్లు వంటి 9 రకాల ఉపకరణాలు పంపిణీ చేశారు.

👉 ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.

👉స్కూటీలు, బ్యాటరీ వాకర్స్, బ్యాటరీ సైకిళ్ళు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతేనన్నారు.

👉 సమాన హక్కులు, సమాన అవకాశాలే ప్రభుత్వ విధానమన్నారు. సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలవుతున్నాయని మంత్రి తెలిపారు.

👉 ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దివ్యాంగుల కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ వారి పక్షానే ఉంటుందని హామీ ఇచ్చారు.

👉 గ్రామీణ ప్రాంతాల దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. తద్వారా సంక్షేమ శాఖ సేవలు మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షల ద్వారా సరైన ఉపకరణాలు అందిస్తున్నామని అన్నారు.

👉 దివ్యాంగుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నామని చెప్పారు. వారి సూచనలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి వెల్లడించారు.

👉 సామాజిక న్యాయమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
అందరికీ గౌరవప్రదమైన జీవనం కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. సంక్షేమం ద్వారా సమాజంలో సమతుల్యత సాధ్యమవుతుందని చెప్పారు. దివ్యాంగులు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వారి వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి లబ్ధిదారుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. దివ్యాంగుల కోసం అన్నిరకాలుగా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అర్హులైన ప్రతిఒక్కరికి కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందేవిధంగా సహకరిస్తామని తెలిపారు.

👉 ఈ వేదికలో ఉపకరణాలు అందనివారు అర్హత ఉండి ఎదురు చూస్తున్నవారు ఇప్పుడు రాలేదని బాధపడకూడదని ఖచ్చితంగా
అర్హులైన ప్రతిఒక్కరికి మరో విడతలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని దివ్యాంగులకు ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ మాట్లాడుతూ….


రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలో ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల మెహంలో సంతోషం చూడాలని దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

దివ్యాంగులను జాలితో కాని దయతో చూస్తారు కానీ ప్రజా ప్రభుత్వం భాద్యతగా చూస్తోందని తెలిపారు. వికలాంగుల పట్ల ప్రభుత్వం శ్రద్ధతో, బాధ్యతతో ఉందని అన్నారు.


👉 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ…


ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్ద మొత్తం లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో మన జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటగా ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. దివ్యాంగులకు అన్నిరకాల సదుపాయాలు ప్రభుత్వ పరంగా, జగిత్యాల ఎమ్మెల్యే గా కల్పిస్తానని అన్నారు.


👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ...


దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.


అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వాకర్స్, బ్యాటరీ సైకిళ్ళు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగిందన్నారు.
దివ్యాంగుల అవసరాలను ముందుగా గుర్తించి ఏర్పాట్లు చేశామని చెప్పారు. వైద్యుల సలహాల ప్రకారం సరైన ఉపకరణాలు అందించామని తెలిపారు. స్కూటీలు, బ్యాటరీ వాకర్స్, బ్యాటరీ సైకిళ్ళు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

జిల్లా స్థాయిలో సంక్షేమ పథకాలు
సమర్థంగా అమలవుతున్నాయని చెప్పారు.
అధికారులు సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు.దివ్యాంగుల కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగమన్నారు. దివ్యాంగులు ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి.రాజ గౌడ్, జగిత్యాల, మెట్ పల్లి ఆర్డీవో లు మధుసూదన్, శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి. నరేష్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్, జిల్లా అధికారులు,  సంక్షేమ శాఖ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.