ఫిబ్రవరి 15 లోగా మున్సిపల్ ఎన్నికలు ?

J.SURENDER KUMAR,

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ  ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించిన సమాచారం.. మేడారం క్యాబినెట్ సమావేశం అనంతరం అధికారులు మంత్రులతో తేదీలు, పండగలు తదితర వివరాలు చర్చించినట్టు సమాచారం.

పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది.

రాష్ట్రంలో గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించడం, రిజర్వేషన్లు కూడా ఖరారవడం,
అలాగే ఫిబ్రవరి చివరి వారం నుంచి వివిధ స్థాయిల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేయాలని మంత్రిమండలి భావించింది.