ఫ్లాష్. ధర్మం తప్పిన ధర్మపురి ఓటర్ల జాబితా !

👉 కార్యాలయానికే పరిమితమయ్యారు క్షేత్రస్థాయి పర్యటనలు మరిచారు !

👉 ఇతర జిల్లా,  గ్రామాలకు చెందిన ఓటర్లు ధర్మపురి ఓటర్లుగా నమోదు !

👉 మాజీ వార్డ్ కౌన్సిలర్ ఓటు మరో వార్డులో నమోదు !

👉 ముసాయిదా ఓటర్ల అవకతవకలపై లిఖితపూర్వక ఫిర్యాదులు పట్టించుకోని యంత్రాంగం !

👉 మంత్రి నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయడానికి  కుట్ర ?

👉 ఆచరణకు నోచుకోని కలెక్టర్, ఎన్నికల కమిషనర్ ఆదేశాలు !

J.SURENDER KUMAR,

స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘ అధికార యంత్రాంగం, ప్రజాస్వామ్య మునగడకు ఓటే కీలకమని, ఓటరుకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవడానికి ఓటు వేయడానికి ఇబ్బందులు లేకుండా చేపట్టిన, చేపట్టనున్న ముందస్తు చర్యలు, కృషి ధర్మపురి మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాలో బూడిదలో పోసిన పన్నీరులా మారింది.  మంత్రి ప్రాతినిత్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

👉 వివరాల్లోకి వెళితే..

ప్రముఖ పుణ్యక్షేత్రం నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి  మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య, , 14222 , వార్డులు 15 ఉన్నాయి. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, కోసం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ ముసాయిదా  జాబితా వివరాలను  అప్పగించారు.  ఈనెల 10 చివరి తేదీ ప్రకటించినా  రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాల మేరకు తుది జాబితా ప్రచారణకు 12 తేదీకి పొడగించారు.

ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వార్డు ఓట్లు మరో వార్డులో మరో వార్డు  ఓట్లు  తమ వార్డులో  నమోదు అయ్యాయని, తదితర అభ్యంతరాలు వివరించడంతో పాటు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి మార్పులు చేర్పులకు గురువారం నాటికి శ్రీకారం చుట్టా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

👉 ఓటర్లు, కౌన్సిలర్ ఆశావాహులలో గందరగోళం !

సొంత ఇల్లు, నివాసం, కుటుంబ సభ్యుల తో ఉన్న వార్డులో ఓటు హక్కు లేకుండా, మరో వార్డులో ముసాయిదా ఓటర్ లిస్టులో పేరు ఉండడంతో ఓటర్లు అయోమయానికి, ఆందోళనకు గురి అవుతున్నారు. ఓటు హక్కు స్థానిక వార్డులో లేకుండా, ఇతర వార్డుల్లో ఉంటే తమ ఇష్టమైన నాయకుడిని, తమ వార్డు అభివృద్ధికి ఓటు ఎలా వేస్తామంటూ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

తమ వార్డు ఓటర్ల పేరు మరో వార్డులో పదుల సంఖ్యలో  నమోదు అయి ఉంటే, తమ గెలుపు ఓటములపై ప్రభావంతో పాటు, పోలింగ్ శాతం తగ్గుతుందేమో అని కౌన్సిలర్ పోటీ ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

👉 ముసాయిదా ఓటర్ లిస్టులో అవకతవకలు కొన్ని మాత్రమే !

👉 2020 లో 6వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన సుధాకర్ అనే మాజీ కౌన్సిలర్  ఓటు ప్రస్తుతం 7వ వార్డులో ఉంది.


.
👉 2020 మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 4వ వార్డ్ లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిన కౌన్సిలర్ అభ్యర్థి  ఓటు ప్రస్తుతం 2వ వార్డులో నమోదయింది.

👉 6 వార్డులో నివాసం ఉంటూ, గత మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి 180 మంది ఓటర్లు  ప్రస్తుతం 14వ వార్డులో నమోదయి ఉన్నాయి. తమ ఓట్లు తమ వార్డుకు బదిలీ చేయమని ఫిర్యాదు చేసిన అధికారులలో స్పందన లేదు.

👉 13 వార్డు లో వివిధ వార్డులలో నివాసం ఉంటున్న దాదాపు 120 మంది ఓట్లు  నమోదయ్యాయి. ఈ ఓట్ల తమ వార్డుకు మార్చాలని ఫిర్యాదు చేసిన అధికారులలో స్పందన కరువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

👉 వెలగటూర్ మండలం  కోటిలింగాల గ్రామానికి చెందిన ఓటరు పేరు, ధర్మపురి మున్సిపాలిటీలో  Sl.No. 20,  బూతు నెంబర్ 37 లో నమోదయింది.  

👉 ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన ఓటర్ ధర్మపురి మున్సిపాలిటీలో Sl. 1276, బూతు నెంబర్ 32 లో LXH1163500 గా నమోదయింది.

👉 ధర్మపురి మండలం నక్కల పేట గ్రామానికి చెందిన ఓటర్ ధర్మపురి మున్సిపాలిటీలో XLH2661692 నమోదయింది. దాదాపు ఈ గ్రామం నుంచి అనేక ఓట్లు నమోదు అయినట్టు సమాచారం.

👉 మంచిర్యాల జిల్లాకు చెందిన  దంపతులు ఓట్లు ధర్మపురిలో తమ బంధువుల ఇంటి నెంబర్ లో నమోదయింది.

( కొన్ని మచ్చుకు మాత్రమే.. )

మండలంలోని రాయపట్నం, చిన్నాపూర్ నాగారం, జైన  తదితర గ్రామ ఓటర్లు ఇక్కడ 15 వార్డులలో నమోదైనట్టు సమాచారం.

అనేక వార్డుల్లో అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడం, కొందరి పేర్లు రెండు సార్లు నమోదు కావడం, మరికొందరివి చిరునామా తప్పుగా నమోదు  లాంటి అనేక అవకతవకలు అగుపిస్తున్నాయి.

నక్కల పేట, కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో గత దశాబ్ద కాలంగా నివాసముంటున్న దాదాపు 50 శాతం మంది ఓటర్లు  మాత్రం గతంలో ఇతర వార్డులలో అద్దెకు ఉన్న ఇళ్లలోనే ఓట్లు  ఉన్నాయి.  ఒకే వార్డు, ఓకే ఇంటిలో నివాసం ఉంటున్న కుటుంబంలో తల్లిదండ్రుల ఓట్లు అదే వార్డులో  కొడుకు కోడలు ఓట్లు మరో వార్డులో నమోదైన చిత్రవిచిత్రాలు అనేకం ఉన్నాయి.

👉 ఆన్ లైన్ ఓటు నమోదుతోనే  అవకతవకలు ?

మండల రెవెన్యూ కార్యాలయంలో ఆన్లైన్ ఓటు నమోదు ప్రక్రియలో,  కౌన్సిలర్ పోటీ  ఆశావాహులు, ఇతర ప్రాంతాలలోని మిత్రుల, బంధువుల, ఆధార్ కార్డులతో నమోదు చేయించడంతోనే ముసాయిదా ఓటర్ జాబితా అస్తవ్యస్తంగా  మారింది అనే చర్చ జరుగుతోంది..

గతంలో హౌసింగ్ మ్యాప్, వార్డు మ్యాపింగ్ ఆధారంగా రౌండ్ క్లాక్ సర్వే తో ఓట్ల మార్పులు చేర్పులకు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిగేది ప్రస్తుతం ఆ ప్రక్రియకు అధికారులు స్వస్తి పలికినట్టు సమాచారం.

👉 ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయడానికా ?

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ  కేంద్రం ధర్మపురి మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ లిస్టు అవకతవకలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం..

ముసాయిదా ఓటర్ జాబితాను అధికార యంత్రాంగం ఈనెల 12 లోపు సవరించుకుంటే  నామినేషన్, ప్రక్రియ, ప్రచారం, పోలింగ్  సందర్భాలలో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా, ఓటర్ లిస్టులో పేర్లు మరో వార్డుకు మార్చారు, వారికి అనుకూలంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేసుకున్నారు ,అంటూ ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తూ  తమకు అనుకూలంగా పోలింగ్ చేయించుకోవడానికి ఆస్కారం ఉందనే చర్చ మొదలైంది.

👉 ధర్మపురి పట్టణ ఓట్ల వివరాలు !

ముసాయిదా ఓటర్ జాబితా ప్రకారం ధర్మపురి పట్టణంలోని 15 వార్డులలో 24 పోలింగ్ కేంద్రాలలో మొత్తం ఓట్లు 14222 ఉన్నాయి.

(1  వార్డు)   1111, (2 వార్డు) 888, (3 వార్డు) 863, (4 వార్డు) 850,  (5 వార్డ్) 975, (6 వార్డ్ ) 846,  (7 వార్డు) 793, (8 వార్డు) 999 (9 వార్డు) 975, (10 వార్డ్) 906, (11 వార్డ్) 921 (12 వార్డ్) 900 (13 వార్డ్) 1222 (14 వార్డ్) 1055  (15 వార్డ్) 918 ఓటర్లు ఉన్నారు.

👉 అమలుకు నోచుకోని కలెక్టర్ ఎన్నికల కమిషనర్ ఆదేశాలు !

ముసాయిదా ఓటర్ జాబితా లో పొరపాట్లను సవరించడానికి మున్సిపల్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు పరిశీలించి లిఖితపూర్వకంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు ధర్మపురి మున్సిపాలిటీలో ఆచరణకు నోచుకోవడం లేదు.

ఓటర్ జాబితాలో మార్పులు చేర్పుల గూర్చి పలువురు మున్సిపల్ యంత్రంగానికి మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో  పర్యటించి పరిశీలించి వివరాలు సేకరించడం లేదనే ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి.. ఈనెల 12 లోగా ఓటర్ జాబితా సవరించుకుంటే  ముసాయిదా ఓటర్ లిస్ట్ యథాతథంగా ప్రచురితం కానున్నది.

జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ స్పందించి  15 వార్డులకు ప్రత్యేక అధికారులను నియమించి స్పెషల్ డ్రైవ్ ద్వారా ముసాయిదా ఓటర్ జాబితాలో అవకతవకలు సవరించుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట కు భంగం కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి..