👉 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో…
J SURENDER KUMAR,
ధర్మపురి బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది, ధర్మపురి మండల తాజా మాజీ బిఆర్ఎస్ జెడ్పిటిసి సభ్యురాలు, బత్తిని అరుణ, గురువారం హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో చేరనున్నారు. ఆమెతో పాటు యువ న్యాయవాది ఇంద్రకరణ్, మరికొందరు చేరనున్నారు.
గత వారం రోజుల క్రితం నలుగురు తాజా మాజీ కౌన్సిలర్లు, పలువురు నాయకులు, జైన విండో చైర్మన్, రైతు సమన్వయ సంఘ నాయకుడు, సర్పంచులు మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
బిజెపి రాష్ట్ర నాయకుడు దామెర రామ సుధాకర్ రావు, నలివెల్లి సృజన రెడ్డి, కందాల నరసింహ మూర్తి, కమలాపూర్ సర్పంచ్ తిరుపతి, చేరిక పై జెడ్పిటిసిఎస్ సభ్యురాలు తో చర్చలు జరిపినట్టు తెలిసింది.
గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీ ధర్మపురి జెడ్పిటిసి సభ్యురాలుగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ విజయలక్ష్మి పై విజయం సాధించారు. మాజీ జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, దళిత నాయకురాలు, విద్యార్థి దశలో గుర్తింపు పొందిన క్రీడాకారిణి, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె ధర్మపురి జడ్పిటిసిగా ఎన్నికయ్యారు..

బిఆర్ఎస్ పార్టీ లో వివక్షత మండల రాజకీయాల్లో ఒకరిద్దరూ చోట మోట నాయకుల ఆధిపత్యం తదితర అంశాలలో పలు సందర్భాలలో తీవ్ర మానసిక వేదన చెందినట్టు ఆమె తన అనుచరులతో ఆవేదన చెందినట్టు చర్చ.
👉 కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కసరత్తు ?
ధర్మపురి నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక బిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్లు కోసం డిమాండ్ చేయమని, మీ ప్రభుత్వ పాలనలో మా గ్రామ అభివృద్ధి జరుగుతుందని నమ్మకం, విశ్వాసంతో పార్టీలో చేరడానికి అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నట్టు సమాచారం.
ఆయా మండలాలలో మా పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయం మేరకు, మీ అభ్యర్థనను పరిశీలిస్తానని, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని వారికి కీలక నాయకుడు సూచించినట్టు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల లోపో, తర్వాతనో, లేదా ? జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల లోపు ఆయా పార్టీల నాయకుల చేరికలపై స్పష్టత రానున్నట్టు సమాచారం.
