ఫ్లాష్ . ధర్మపురి కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు !

J.SURENDER KUMAR,

ధర్మపురి కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు, పలువురు బి ఆర్ ఎస్ నాయకులు మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో నేడు (గురువారం )చేరనున్నారు..

గత రెండు సంవత్సరాలుగా మంత్రి లక్ష్మణ్ కుమార్, నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, రాజకీయాలకతీతంగా  మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిపాలన తీరు. నియోజకవర్గంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా, సాగు తాగునీటి సమస్యలు మూతపడిన తెలుగు కాలేజీ తిరిగి తెరిపించడం, డిగ్రీ కాలేజ్ మంజూరు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, తదితర సంక్షేమ పథకాలతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ పాలనకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తమ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు వివరించినట్టు తెలిసింది.
.
2027 లో జరగనున్న గోదావరి నది పుష్కరాల్లో ధర్మపురి పట్టణ , ఆలయ, తదితర అభివృద్ధి జరుగుతుందని  , విద్యా వైద్యం తదితర మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని తమకు మంత్రి లక్ష్మణ్ కుమార్ పై నమ్మకం తో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తమ అనుచర గణం కు వివరించినట్టు సమాచారం.
.
గత కొన్ని రోజులుగా వీరిని సంప్రదించడానికి బిఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నించిన ఈ నాయకులు అందుబాటులో రానట్టు తెలిసింది.