ఫ్లాష్.. ప్రిన్సిపల్ సస్పెన్షన్ ?

J. SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం మగ్గిడి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టు సమాచారం.

సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారుల, విద్యా నిర్వహణ సంబంధం  తదితర అంశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ప్రవర్తనతో పాటు,  విద్యార్థులను వేధించడం, గత నెలరోజుల క్రితం కొందరు మైనర్ విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయమని లేదంటే ఎస్పీకి ఫిర్యాదు చేస్తానంటూ పోలీస్ అధికారులను హెచ్చరించడం తదితర అంశాలతో పాటు శాఖ పరమైన విచారణలో ప్రిన్సిపాల్ దురుసు ప్రవర్తన వెలుగు చూసినట్టు సమాచారం..

గత కొన్ని రోజులు క్రితం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రిన్సిపాల్ తీరుతున్నల పై సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి గోడు వెల్లపోసుకున్నట్టు సమాచారం.

మంత్రి మగ్గిడి పాఠశాల ఉదంతంపై పరిశీలించాల్సిందిగా ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు తెలిసింది.. శుక్రవారం సస్పెన్షన్ ఉత్తర్వులు సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా ప్రిన్సిపాల్ కు అందించనున్నట్టు సమాచారం.